logo

జోరున వాన.. అన్నదాత ఆవేదన

మండలంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మన్‌సాన్‌పల్లి, దుగ్గాపూరు, రేగొండి, కొండాపూరు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మంబాపూరు కొనుగోలు కేంద్రంలో వడ్లు

Published : 19 May 2022 02:11 IST

మంబాపూరు కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని చూపుతున్న రైతులు

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: మండలంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మన్‌సాన్‌పల్లి, దుగ్గాపూరు, రేగొండి, కొండాపూరు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మంబాపూరు కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిపోయాయి. పొలాల్లో కోతకు వచ్చిన పంట నేలవాలి నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రంలో సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిసిన ప్రతిసారి అవస్థలు తప్పడం లేదని చెప్పారు. వర్షం మొదలు కాగానే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తరుచూ సరఫరాలో అంతరాయం కావడంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షం తగ్గినా గంటల తరబడి విద్యుత్తు రావడం లేదు.
తాండూరుగ్రామీణ: తాండూరు మండలం గ్రామాల్లో వర్షం కురిసింది. ఉల్లి కోతలు పూర్తైన రైతులు వర్షంలో తడిసిపోకుండా ఉండేందుకు తాడిపత్రులు కప్పి ఉంచే ప్రయత్నాలు చేశారు. వర్షాల కారణంగా గోనూరు, నారాయణ్‌పూర్‌, వీర్‌శెట్టిపల్లి, ఎల్మకన్నె, చెంగెష్‌పూర్‌, అంతారం, అంతారంతండాలో వరి కోత పనుల్ని వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని