Telangana News: గ్రామీణ ప్రాంతాలకు నేరుగా నిధులిస్తే తప్పేంటి?: రఘునందన్‌రావు

పంచాయతీల్లో జరిగే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుందని, అవినీతి లేకుండా ఉండేందుకే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం డబ్బులను నేరుగా ఖాతాల్లో వేస్తుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.

Updated : 19 May 2022 18:01 IST

హైదరాబాద్: పంచాయతీల్లో జరిగే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తుందని, అవినీతి లేకుండా ఉండేందుకే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం డబ్బులను నేరుగా ఖాతాల్లో వేస్తుందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఎలా ఇస్తుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించడం ఏంటని ఆక్షేపించారు. అన్ని పథకాలకు కేంద్రం నిధులిస్తే.. తెరాస చేసినట్లు ప్రచారం చేసుకుంటోందన్నారు. తెలంగాణను చూసి పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్‌ అంటున్నారని.. మరి భారతదేశం లేకపోతే తెలంగాణ ఎక్కడుంటుందన్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా మాట్లాడొద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లకు రాజ్యసభ సీట్లు కేటాయించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ఉద్యమకారులు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. అగ్రకులాల వారికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని రఘునందన్‌రావు ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని