logo

జరీన్‌ గెలిచె.. జమీన్‌ మురిసె!

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించటంతో నగరం మురిసిపోయింది. ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.

Published : 20 May 2022 01:58 IST

మణికొండ, ఎల్బీ స్టేడియంలో సంబరాలు


తల్లి పర్వీనా సుల్తానాకు మిఠాయిలు తినిపిస్తున్న జరీన్‌ అక్కలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించటంతో నగరం మురిసిపోయింది. ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. సామాజిక మాధ్యమాల్లో అభినందనలతో ముంచెత్తారు. గురువారం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 52 కిలోల విభాగం తుదిపోరు జరగడం, నిఖత్‌ పోటీలో ఉండడంతో నగరవాసులు టీవీలకు అతుక్కుపోయారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, నిఖత్‌ తండ్రి జమీల్‌, బాక్సింగ్‌ కోచ్‌లు, క్రీడాకారులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.


ఎల్బీ స్టేడియంలో నిఖత్‌ తండ్రి విజయోత్సాహం


మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం చూశా

పర్వీన్‌ సుల్తానా, నిఖత్‌ తల్లి

నిఖత్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావటం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి తనలోని పట్టుదల, క్రమశిక్షణ, దూకుడు స్వభావం విజయానికి కారణం. మాకు నలుగురు ఆడపిల్లలు.. పెద్దమ్మాయిలిద్దరూ వైద్యవిద్య పూర్తిచేశారు. జరీనా మూడో అమ్మాయి. చదువులో.. ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండేది. తనకు బాక్సింగ్‌ అంటే చాలా ఇష్టం. తదనుగుణంగానే ప్రోత్సహిస్తూ వచ్చాం. లక్ష్యం చేరేందుకు నిరంతరం కష్టపడుతూనే ఉండేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని