logo

ప్రైవేటు సంస్థలు మా సదుపాయాలు వాడుకోవచ్చు

రక్షణ పరిశోధనశాలల్లోని ప్రభుత్వ పరీక్ష వ్యవస్థలను, సౌకర్యాలను ప్రైవేటు సంస్థలు ఉపయోగించుకోవచ్చని రక్షణ శాఖ పరిశోధన,....

Updated : 20 May 2022 02:39 IST

డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి


ఆదిభట్ల ఎరోస్పేస్‌ పార్కులో డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి, సంస్ఘ ఛైర్మన్‌ సూర్యారావు, ఎండీ సరితా రాతిబండ్ల,

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ పరిశోధనశాలల్లోని ప్రభుత్వ పరీక్ష వ్యవస్థలను, సౌకర్యాలను ప్రైవేటు సంస్థలు ఉపయోగించుకోవచ్చని రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన వెయ్యికిపైగా సాంకేతికతలను ఉచితంగా పరిశ్రమలకు బదలాయించేలా ప్రక్రియను సులభతరం చేశామని చెప్పారు. ఆదిభట్లలోని ఎరోస్పేస్‌ పార్కులో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎస్‌కేఎం టెక్నాలజీస్‌ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నారాయణమూర్తి, ఎస్‌కేఎం టెక్నాలజీ ఛైర్మన్‌ జి.ఆర్‌. సూర్యారావు, ఎండీ సరితా రాతిబండ్ల, డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ అవినాష్‌ చందర్‌, మిధాని డైరెక్టర్‌ గౌరీ శంకర్‌, తెలంగాణ ప్రభుత్వ ఎరోస్పేస్‌, డిఫెన్స్‌ డైరెక్టర్‌ ప్రీవీణ్‌ పీఏ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని