logo

పైవంతెన నిర్మాణం దృష్ట్యా ట్రాఫిక్‌ మళ్లింపు

అంబర్‌పేట పైవంతెన నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపు, ఆంక్షలను విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ విభాగం సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కోరారు.

Published : 20 May 2022 02:49 IST


స్థానికులతో మాట్లాడుతున్న నగర ట్రాఫిక్‌ విభాగం సంయుక్త కమిషనర్‌ రంగనాథ్‌

గోల్నాక, న్యూస్‌టుడే: అంబర్‌పేట పైవంతెన నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపు, ఆంక్షలను విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ విభాగం సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కోరారు. మూడు నెలలపాటు కొనసాగనున్న వాహనాల మళ్లింపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం గోల్నాక కొత్త బ్రిడ్జి వద్ద వాహనాల మళ్లింపును ట్రాఫిక్‌ అదనపు డీసీపీ ప్రసాద్‌, ఈస్ట్‌జోన్‌ ఏసీపీ సంపత్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. ఉప్పల్‌, రామంతాపూర్‌ నుంచి వచ్చే వాహనదారులు అంబర్‌పేట శ్రీరమణ, అలీకేఫ్‌ చౌరస్తాలు, జిందాతిలస్మత్‌ మీదుగా గోల్నాక వైపునకు రావాలని తెలిపారు. కోఠి, చాదర్‌ఘాట్‌ నుంచి వచ్చే వాహనదారులు కాచిగూడ నింబోలిఅడ్డ, టూరిస్ట్‌ హోటల్‌, నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి, ఆరో చౌరస్తా కూడళ్ల మీదుగా రామంతాపూర్‌, ఉప్పల్‌ వైపునకు వెళ్లాలని పేర్కొన్నారు. ప్రార్థనా మందిరాల వద్ద రాకపోకలకు వీలును కల్పించాలని కాంగ్రెస్‌ మైనార్టీ విభాగం అంబర్‌పేట అసెంబ్లీ ఛైర్మన్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఫరీద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులను కోరారు. కాచిగూడ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, అదనపు ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని