logo

కూల్చివేతలో జాప్యం.. కూలి తప్పిన ప్రమాదం

బోయిగూడలో అగ్నిప్రమాదానికి కారణమైన తుక్కుగోదాం ప్రహరీ గురువారం కూలిపోయింది. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

Published : 20 May 2022 02:49 IST


తాజాగా కూలిన భవనం ఉన్న ప్రాంతం

పద్మారావునగర్‌, న్యూస్‌టుడే: బోయిగూడలో అగ్నిప్రమాదానికి కారణమైన తుక్కుగోదాం ప్రహరీ గురువారం కూలిపోయింది. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అది గమనించగానే స్థానికులు గాంధీనగర్‌ ఠాణా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అటుగా ఎవరూ వెళ్లకుండా అడ్డుగా తాళ్లు కట్టారు. మార్చి 23న బన్సీలాల్‌పేట డివిజన్‌ బోయిగూడలోని తుక్కుగోదాంలో అగ్నిప్రమాదం జరిగి 12 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అనంతరం గోదాంను నేలమట్టం చేయాల్సి ఉండగా, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ఆ పని చేయలేదు. తాజాగా భవనం తాలుకూ ప్రహారీగోడలు కూలిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని