logo

సామాజిక పరిణామాలను విద్యార్థులు తెలుసుకోవాలి

విద్యార్థులకు గ్రంథాలయం, ఆటస్థలం రెండూ దేవాలయాల వంటివని వాటిని ప్రతిరోజు సందర్శించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీబీఐ మాజీ జాయింట్‌ డైరక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. కొండాలక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం

Published : 22 May 2022 04:30 IST


కార్యక్రమంలో మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: విద్యార్థులకు గ్రంథాలయం, ఆటస్థలం రెండూ దేవాలయాల వంటివని వాటిని ప్రతిరోజు సందర్శించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీబీఐ మాజీ జాయింట్‌ డైరక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. కొండాలక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్‌ ఉద్యాన కళాశాల దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.... చదువుతో పాటు ఆటలపై దృష్టి సారించాలని సూచించారు. చదువుతో పాటు సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. అందుకోసం వార్త పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యాన విద్యార్థులు దృష్టి సారించాలని కోరారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ నీరజ ప్రభాకర్‌ మాట్లాడుతూ....విశ్వవిద్యాలయం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నతస్థాయిలో నిలవడానికి కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలువురు ఆటపాటలతో సందడి చేశారు. వర్సిటీ అధికారులు కిరణ్‌, పద్మ, శ్రీనివాస్‌, గర్విణీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని