logo

ఆ రెండు డెయిరీలు మూసేయండి: పీసీబీ

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెండు డెయిరీ ఉత్పత్తుల తయారీ యూనిట్ల మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆదేశాలిచ్చింది. స్థానికుల ఫిర్యాదు, ఇతర సమాచారం ఆధారంగా పటాన్‌చెరు సమీపం పాశమైలారంలోని

Published : 22 May 2022 04:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెండు డెయిరీ ఉత్పత్తుల తయారీ యూనిట్ల మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆదేశాలిచ్చింది. స్థానికుల ఫిర్యాదు, ఇతర సమాచారం ఆధారంగా పటాన్‌చెరు సమీపం పాశమైలారంలోని పవిత్ర డెయిరీ, విశాఖ డెయిరీల్ని తనిఖీ చేసిన అధికారులు వాటిని మూసివేస్తూ ఆదేశాలిచ్చారు. పవిత్ర డెయిరీలో నిషేధిత రసాయనాలు, గుర్తింపు పొందని(అన్‌ బ్రాండెడ్‌) పాల పొడి, ఎక్కువ మోతాదులో సిట్రిక్‌ యాసిడ్‌ వినియోగించి పాలు, పెరుగు, పన్నీరు తయారు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తనఖీ చేసి గత ఏడాది ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం పీసీబీకి ఫిర్యాదు చేశారు. అలాగే విశాఖ పాల ఉత్పత్తుల సంస్థ వ్యర్థాల్ని స్థానిక పారిశ్రామికవాడ పరిసరాల్లోని డ్రైనేజీలోకి విడుదల చేస్తోందని అధికారులు తనిఖీల్లో గుర్తించారు. నిబంధనల ప్రకారం వర్థాల్ని సీఈపీటీకి తరలించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని