logo

చిత్రవార్తలు

ఎల్బీనగర్‌ కూడలిలో కనిపించిన సుందర చిత్రమిది. ఒకవైపు ఒకే సమయంలో రెండు మెట్రో రైళ్లు, మరోవైపు ఆటో, కార్లు, ఇతర వాహనాలు పరుగులు తీస్తూ కనిపించాయి. రెండు మార్గాలు వేరైనా ఇలా వరుస కట్టినట్టుగా వెళుతూ కనువిందు చేసాయి  

Published : 24 May 2022 01:42 IST

వాహన వరుస.. మురిపెంచె చూడు!

ఎల్బీనగర్‌ కూడలిలో కనిపించిన సుందర చిత్రమిది. ఒకవైపు ఒకే సమయంలో రెండు మెట్రో రైళ్లు, మరోవైపు ఆటో, కార్లు, ఇతర వాహనాలు పరుగులు తీస్తూ కనిపించాయి. రెండు మార్గాలు వేరైనా ఇలా వరుస కట్టినట్టుగా వెళుతూ కనువిందు చేసాయి  


నిన్న పద్ధతి.. నేడు పరిపాటి!    

ఈ నెల 13న.. బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వారు హిమాయత్‌నగర్‌ నారాయణగూడ ప్రాంతాల్లో రోడ్లపై ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఇది తెలిసి అక్రమణదారులు వెంటనే సామగ్రి సర్దుకుని దుకాణాలు మూసివేశారు.  అధికారులలా వెళ్లగానే మళ్లీ పాదబాటలు, రోడ్లను ఆక్రమించేశారు. వైఎంసీఏ కూడలిలో ఓ టిఫిన్‌ సెంటర్‌ తీరు అందుకు నిదర్శనం.


వెతలకూ పెద్దాసుపత్రే!

ఉస్మానియా ఆసుపత్రికి వివిధ జిల్లాల నుంచి వచ్చే జనాల వెతలు వర్ణణాతీతం. చక్రాల కుర్చీలో తీసుకెళ్లాలంటే రూ.50, స్ట్రెచర్‌కు రూ.100 ఇవ్వాలని సిబ్బంది కోరడంతో రోగుల కుటుంబ సభ్యులే ఇలా ఒకే  స్ట్రెచర్‌పై ఇద్దరిని తీసుకెళుతున్నారు.  


ధర దిగొస్తే ఇంతే!

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు తగ్గించిన నేపథ్యంలో నగరంలోని కొన్ని బంకుల్లో పెట్రోల్‌ లేదని నోస్టాక్‌ బోర్డులు కనిపించాయి.  కొన్ని బంకులు సోమవారం మూసి కనిపించాయి. ఖైరతాబాద్‌లోని పెట్రోల్‌ బంకు మూసిఉన్న చిత్రమిది.


నగరవాసి.. మెట్లెక్కితే నామోషీ!

నగరంలోని మెట్రో స్టేషన్లలో సాధారణ మెట్లతో పాటు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు.  ఒక్కో మెట్టు ఎక్కితే ఆరోగ్యమని, బరువూ తగ్గుతారని కొన్ని స్టేషన్లలో రాయించినా ప్రయాణికులంతా ఎస్కలేటర్లపైనే కిక్కిరిసి వెళుతున్నారు. సోమవారం అమీర్‌పేట స్టేషన్లో ఖాళీ మెట్లు, కిక్కిరిసిన ఎస్కలేటర్‌ కనిపించాయిలా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని