logo

Osmania University: ఒక కళాశాలలో చేరి.. మరో కళాశాలలో చదువుకోవచ్చు

దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పది అటానమస్‌ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి క్లస్టర్‌ విధానానికి తెరలేపింది. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.

Published : 24 May 2022 07:48 IST

 వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లస్టర్‌ విధానం

సమావేశంలో నవీన్‌మిత్తల్‌, ప్రొ.ఆర్‌.లింబాద్రి, వి.వెంకటరమణ, ప్రొ.డి.రవీందర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పది అటానమస్‌ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి క్లస్టర్‌ విధానానికి తెరలేపింది. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి, వైస్‌ఛైర్మన్‌ వి.వెంకటరమణ, ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌ సమక్షంలో ఆయా కళాశాలల ప్రిన్సిపళ్లు ఓయూలో సోమవారం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. ఈ విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఇందులో ఏదైనా ఒక కళాశాలలో చేరిన విద్యార్థి వేరొక కళాశాలలో చేరే అవకాశం చిక్కుతుంది. విద్యార్థి తాను చేరిన కళాశాలలో ఏదైనా సబ్జెక్టు/పేపర్‌కు బోధకులు లేకపోవడం, సరైనా సదుపాయాలు లేవని భావించి వేరొక కళాశాలలో ఉన్నాయనుకుంటే.. అక్కడికి మారే వీలుంటుంది. ఈ సదుపాయం ఏదైనా ఒక సెమిస్టర్‌ లేదా పూర్తి మూడేళ్లకు సద్వినియోగం చేసుకోవచ్చు. పది కళాశాలల్లో ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఉంటుంది.ఉత్తమ పద్ధతుల్లో విద్యార్థులకు బోధన ఉంటుందని  కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ చెప్పారు.

క్లస్టర్‌లో పరిధిలోకి వచ్చిన కళాశాలలు.. సెయింటాన్స్‌ కళాశాల(మెహిదీపట్నం), లయోలా అకాడమీ(సికింద్రాబాద్‌), సెయింట్‌జోసెఫ్‌ డిగ్రీ, పీజీ కళాశాల, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాల, ఆర్‌బీవీవీఆర్‌ఆర్‌ కళాశాల(నారాయణగూడ), భవన్స్‌ వివేకానంద కళాశాల(సైనిక్‌పురి), నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల, ప్రభుత్వ సిటీ కళాశాల, బేగంపేట మహిళా కళాశాల.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని