logo

నల్గొండలో అదృశ్యం.. నగరంలో ఆత్మహత్యాయత్నం

నల్గొండలో అదృశ్యమైన వ్యక్తి.. వనస్థలిపురంలోని ఓ హోటల్‌ చేరుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంసభ్యులకు ఫోన్‌లో చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. క్షణాల్లో స్పందించి అతన్ని కాపాడారు. వనస్థలిపురం

Published : 24 May 2022 01:50 IST

 3 నిమిషాల్లో చేరుకొని ఆస్పత్రిలో చేర్పించి కాపాడిన పోలీసులు

చికిత్స పొందుతున్న పాకాల సాయికృష్ణ

వనస్థలిపురం, న్యూస్‌టుడే: నల్గొండలో అదృశ్యమైన వ్యక్తి.. వనస్థలిపురంలోని ఓ హోటల్‌ చేరుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంసభ్యులకు ఫోన్‌లో చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. క్షణాల్లో స్పందించి అతన్ని కాపాడారు. వనస్థలిపురం పోలీసులు వివరాల ప్రకారం.. నల్గొండలోని సాయినగర్‌ కాలనీలో ఉండే పాకాల సాయికృష్ణ(28) డిగ్రీ పూర్తిచేసి స్థానికంగా వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు సోదరులు. మూడురోజుల క్రితం ఇంటి నుంచి వచ్చిన సాయికృష్ణ.. ఆదివారంరాత్రి వనస్థలిపురం అభ్యుదయనగర్‌లోని ఓయో హోటల్‌కు వచ్చి గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, పురుగుల మందు తాగానని తెలిపాడు. కుటుంబసభ్యులు వెంటనే వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. మూడు నిమిషాల్లోనే పెట్రోలింగ్‌ వాహనంలో హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, హోంగార్డు రాజు హోటల్‌కువెళ్లి.. సాయికృష్ణను గుర్తించి వెంటనే సమీపంలోని మెడిసిస్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. పోలీసు సిబ్బందిని ఏసీసీ పురుషోత్తంరెడ్డి, సీఐ సత్యనారాయణ అభినందించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని