logo

పోలీసుల అదుపులో మిగిలిన ఇద్దరు నిందితులు!

నీరజ్‌ పన్వర్‌ హత్య కేసులో పరారీలో ఉన్న కీలక నిందితులైన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 20న బేగంబజార్‌ చేపల మార్కెట్‌ వద్ద యువ వ్యాపారి నీరజ్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు

Published : 24 May 2022 01:50 IST

నీరజ్‌ పన్వర్‌ హత్య కేసు..

గోషామహల్‌, న్యూస్‌టుడే: నీరజ్‌ పన్వర్‌ హత్య కేసులో పరారీలో ఉన్న కీలక నిందితులైన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 20న బేగంబజార్‌ చేపల మార్కెట్‌ వద్ద యువ వ్యాపారి నీరజ్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉండగా, వీరిలో ఇద్దరు మైనర్లు సహా మొత్తం నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఏ1 అభినందన్‌యాదవ్‌, ఏ4 మహేశ్‌యాదవ్‌లను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అధికారికంగా ధ్రువీకరించలేదు.  రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను వారం పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా షాయినాయత్‌గంజ్‌ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్‌ వేశారు.

ప్రధాన నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడు: సంజన 

తన భర్త హత్య కేసులో ప్రధాన సూత్రధారిని పోలీసులు పట్టుకోలేదని, తమ కుటుంబానికి ప్రాణహాని పొంచి ఉందని నీరజ్‌ పన్వర్‌ భార్య సంజన ఆందోళన వ్యక్తంజేశారు. బేగంబజార్‌లో మార్వాడీ సమాజ్‌, నీరజ్‌ పన్వర్‌ కుటుంబసభ్యులతో కలిసి నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ ముగిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన భర్త హత్య జరిగి మూడు రోజులైనా ప్రధాన నిందితుడిని అరెస్టు చేయలేదన్నారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరపాలని, హంతకులకు ఉరిశిక్ష వేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని