logo

Swagruha Flats: 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు భారీ డిమాండ్‌!

రాజీవ్‌ స్వగృహకు సంబంధించి ఎక్కువ మంది 3బీహెచ్‌కే డీలక్స్‌, 3బీహెచ్‌కే ఫ్లాట్లుకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బండ్లగూడ వద్ద అపార్ట్‌మెంట్లలో ఉన్న ఫ్లాట్లకు దరఖాస్తులు వస్తున్నాయి. ఫ్లాట్ల విస్తీర్ణం

Updated : 24 May 2022 12:04 IST

 బండ్లగూడ వైపు ఎక్కువ మొగ్గు.. పోచారం అంతంతే

రాజీవ్‌ స్వగృహ ఇళ్లకు 14 వేలపైనే దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: రాజీవ్‌ స్వగృహకు సంబంధించి ఎక్కువ మంది 3బీహెచ్‌కే డీలక్స్‌, 3బీహెచ్‌కే ఫ్లాట్లుకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బండ్లగూడ వద్ద అపార్ట్‌మెంట్లలో ఉన్న ఫ్లాట్లకు దరఖాస్తులు వస్తున్నాయి. ఫ్లాట్ల విస్తీర్ణం 1487, 1617 చదరపు గజాలు ఉండటం...ఆ ప్రాంతంలో ఇది చాలా తక్కువ ధర కావడంతో ప్రజలు ముందుకొస్తున్నారు. బండ్లగూడతోపాటు పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి ఈ నెల 11న హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు 14,150 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 10 వేలపైనే బండ్లగూడలో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.  
* బండ్లగూడలో 1501, పోచారంలో 1470 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టనున్నారు. బండ్లగూడలో పూర్తయిన 419 ఫాట్లు చదరపు అడుగుకు రూ.3 వేలు, కొంత అసంపూర్తిగా ఉన్న 1082 ఫ్లాట్లను చదరపు అడుగు రూ.2750గా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

* పోచారంలోపూర్తయిన 1328 ఫ్లాట్లను చ.అ.కు రూ.2500 చొప్పున, అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్లకు చ.అ.కి రూ.2250గా ధర నిర్ణయించారు. 

* ప్రస్తుతం బండ్లగూడలో 3 బీహెచ్‌కే డీలక్స్‌ 345, 3బీహెచ్‌కే 444, 2బీహెచ్‌కేవి 712 అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

* పోచారంలో 3బీహెచ్‌కేవి 91, మరో 53 వరకు 3బీహెచ్‌కే,  2బీహెచ్‌కేవి 884, సింగిల్‌ బెడ్‌రూం ఇళ్లు 442 విక్రయించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని