logo

ఆదివాసీల సంస్కృతిని భావితరాలకు అందించాలి

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్‌ పంతుకల శ్రీనివాస్‌

Published : 24 May 2022 02:06 IST

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అల్లం నారాయణ, పంతుకల శ్రీనివాస్‌ తదితరులు

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్‌ పంతుకల శ్రీనివాస్‌ రచించిన ‘ట్రెడిషనల్‌ ఫోక్‌ మీడియా ఇన్‌ ఇండియా’ అనే పుస్తకాన్ని ఇఫ్లూలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం అల్లం నారాయణ మాట్లాడుతూ.. మీడియా విస్తృతమైన ప్రస్తుత కాలంలో ఇటువంటి పుస్తకాన్ని రాయడం అభినందనీయమన్నారు. ఆదివాసీల పండుగలు, వాటి ఉపయోగాలను వివరించేందుకు ఈ పుస్తకం దోహదపడుతుందని అన్నారు. పుస్తక రచయిత పంతుకల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ఆదివాసీ తెగల జానపద కళలు, వాటి ఆవశ్యకతను తెలిపేలా పుస్తకాన్ని రచించినట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రొ.మనోజ, ప్రొ.నాగమల్లిక, విద్యార్థి నాయకులు దర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని