రేపు వివాహం: ప్రియుడు బలవన్మరణం.. ప్రియురాలు ఆత్మహత్యాయత్నం

సహజీవనం చేస్తున్న మహిళను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఈనెల 25న వివాహానికి ఏర్పాట్లు చేసుకోగా సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్వేత వివరాల మేరకు..

Updated : 24 May 2022 07:25 IST

విజయ్‌కుమార్‌

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: సహజీవనం చేస్తున్న మహిళను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఈనెల 25న వివాహానికి ఏర్పాట్లు చేసుకోగా సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్వేత వివరాల మేరకు... ఏపీలోని కడప జిల్లా కొండాపురానికి చెందిన విజయ్‌కుమార్‌(40)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అదే జిల్లాలో రైల్వే స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్యకు దూరంగా ఉంటున్నాడు. నగరంలోని టప్పచపుత్రాలో నివసించే మహిళతో ఎనిమిదేళ్ల కిందట పరిచయమైంది. సంవత్సర కాలంగా వీరిద్దరూ రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 25న వివాహం చేసుకోవాలని నెలరోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల క్రితం విజయ్‌కుమార్‌ ఆ మహిళకు చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆమె టప్పచపుత్రా ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును రాజేంద్రనగర్‌ ఠాణాకు బదిలీచేశారు. రాజేంద్రనగర్‌ పోలీసులు ఆదివారం విజయ్‌కుమార్‌, ఆ మహిళను ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు. సోమవారం వివాహ దుస్తులు తెచ్చుకోవడానికి ఆమె వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయ్‌కుమార్‌ కాబోయే భార్యకు ఫోన్‌చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. వెంటనే ఆమె ఇంటికి చేరుకుంది. అప్పటికే అతను మృతిచెందాడు. దీంతో ఆమె ఖైరతాబాద్‌ సమీపంలో ఎంఎంటీఎస్‌ రైలు కిందపడి చనిపోవాలని పట్టాలపై పడుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా గుర్తించి కాపాడారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని