logo

Hyd News: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, బస్టాప్‌ల మధ్య బ్యాటరీ వాహనాలు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పరిసర బస్టాపులకు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా వెళ్లేందుకు టీఎస్‌ఆర్టీసీ బ్యాటరీ వాహనాల(ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌)ను అందుబాటులోకి తీసుకురానుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

Published : 24 May 2022 08:53 IST

ఈనాడు, హైదరాబాద్‌:  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పరిసర బస్టాపులకు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా వెళ్లేందుకు టీఎస్‌ఆర్టీసీ బ్యాటరీ వాహనాల(ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌)ను అందుబాటులోకి తీసుకురానుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ముందు ఉండే బస్సు స్టేషన్‌తో పాటు.. ఆల్ఫా హోటల్‌, స్టేషన్‌కు కుడివైపున ఉన్న రేతిఫైల్‌, బ్లూసీ హోటల్‌ ఎదురుగా ఉప్పల్‌ వెళ్లే బస్టాపుతో పాటు.. మెట్టుగూడ, చిలకలగూడ, గాంధీ ఆసుపత్రి వైపు వెళ్లే బస్టాపులకు సులభంగా చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్లాట్‌ఫామ్‌లపై సమాచార కేంద్రాలు..  రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా ప్లాట్‌ఫామ్స్‌పై సమాచార కేంద్రాలు ఉంటాయి. రైలు దిగగానే వాటి వద్దకు వెళ్లి ఎక్కడకు వెళ్లాలో చెబితే.. బ్యాటరీ వాహనాలు రప్పిస్తారు. వాటిపై సమీప ఆర్టీసీ సిటీ బస్టాపులకు సులభంగా చేరుకోవచ్చు. ఒకవేళ మెట్రో రైల్లో వెళ్లాలంటే.. అక్కడికే తీసుకెళతారు. ప్రయాణికులు ఆర్టీసీ సిటీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకోవడానికి టీఎస్‌ఆర్టీసీ ఈ మేరకు చర్యలు చేపడుతోంది. మరో వారం, పది రోజుల్లో ఈ ఉచిత వాహన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ సికింద్రాబాద్‌ ఆర్‌ఎం వెంకన్న తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని