logo

నాలాల పొడవునా జాలీలు

వర్షాకాలం సమీపిస్తుండటంతో నాలా పూడికతీత పనులను జీహెచ్‌ఎంసీ ముమ్మరం చేసింది. నగర వ్యాప్తంగా ఇప్పటివరకు 63 శాతం పనులు పూర్తయినట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది.

Published : 24 May 2022 03:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాకాలం సమీపిస్తుండటంతో నాలా పూడికతీత పనులను జీహెచ్‌ఎంసీ ముమ్మరం చేసింది. నగర వ్యాప్తంగా ఇప్పటివరకు 63 శాతం పనులు పూర్తయినట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది. వర్షాకాలానికి ముందు గరిష్ఠంగా 70 శాతం పూడికను తొలగిస్తామని ఇంజినీరింగ్‌ విభాగం పేర్కొంది. అనంతరం నాలాల పొడవునా జాలీలు నిర్మించే పనులు చేపడతారు. పూడికతీత పనుల కోసం చాలా ప్రాంతాల్లో రక్షణ గోడలు లేదా జాలీలను గుత్తేదారులు తొలగించారు. పనులు ముగియగానే ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాలీలను, రక్షణ గోడలను పునరుద్ధరించే పనులను జూన్‌లో పూర్తి చేయాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది. వర్షాలు మొదలయ్యాక.. నాలాల పొడవునా ఉండే కల్వర్టులు, మోరీల వద్ద పేరుకుపోయిన చెత్త తొలగింపుతోపాటు రహదారులపై గుంతలు పూడ్చటం, నీటి నిల్వలు తొలగించడం తదితర పనులకు సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని