logo

పరిశోధకులకు ‘శ్రీమాన్‌’ వరం

కేంద్రం ప్రవేశపెట్టిన సైంటిఫిక్‌ రీసెర్చ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరింగ్‌ అండ్‌ నెట్‌వర్క్స్‌(శ్రీమాన్‌) పరిశోధకులకు వరంగా మారనుంది. జాతీయ పరిశోధన సంస్థల్లోని ఖరీదైన మౌలిక వసతులను

Published : 26 May 2022 02:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన సైంటిఫిక్‌ రీసెర్చ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరింగ్‌ అండ్‌ నెట్‌వర్క్స్‌(శ్రీమాన్‌) పరిశోధకులకు వరంగా మారనుంది. జాతీయ పరిశోధన సంస్థల్లోని ఖరీదైన మౌలిక వసతులను చిన్న నగరాల నుంచి వచ్చే పరిశోధకులు సైతం వినియోగించుకోవచ్చు. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలతోనూ మౌలిక వసతులను పంచుకునేవారు. వీటిని అంకుర సంస్థలు, ప్రైవేటు పరిశోధకులు సైతం వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఆయా సంస్థల్లో ప్రజల సొమ్ముతో ఏర్పాటవుతున్న వసతులను మరింత సమర్థంగా వినియోగించడంతో పాటూ ఆదాయమూ వస్తుందని ప్రభుత్వం చెబుతుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. శ్రీమాన్‌ పరిధిలోకి వచ్చే సంస్థలు ఉన్నాయి. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ, సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయాలజీ(ఎన్‌ఐఏబీ), ఏఆర్‌సీఐ, సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్‌జీఆర్‌ఐ, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, మిల్లెట్స్‌ రీసెర్చ్‌, ఆయిల్‌ సీడ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లు, ఎన్‌ఐఎన్‌, నేషనల్‌ యానిమల్‌ రీసోర్స్‌ ఫెసిలిటీ ఆఫ్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌, ఐఐటీ హైదరాబాద్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, ఇఫ్లూ, సెంట్రల్‌, ఉర్దూ యూనివర్సిటీ, తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని