logo

నిందితులను త్వరగా శిక్షించాలి

ఇప్పటికీ తమ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణభయంతో జీవనం సాగిస్తున్నామని బేగంబజార్‌లో పరువు హత్యకు గురైన నీరజ్‌ పన్వార్‌ కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా సత్వర

Published : 26 May 2022 02:30 IST

నీరజ్‌ పన్వార్‌ కుటుంబ సభ్యుల డిమాండ్‌


హోంమంత్రికి ఇచ్చిన వినతిపత్రాన్ని చూపుతున్న సంజన

బంజారాహిల్స్‌ న్యూస్‌టుడే: ఇప్పటికీ తమ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణభయంతో జీవనం సాగిస్తున్నామని బేగంబజార్‌లో పరువు హత్యకు గురైన నీరజ్‌ పన్వార్‌ కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా సత్వర విచారణ జరిపి.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మృతుడు నీరజ్‌ పన్వార్‌ భార్య సంజన, కుమారుడు రెండునెలల శ్రీయాంశ్‌, నీరజ్‌ తల్లి నిషా, తాత జగదీష్‌ ప్రసాద్‌ పవార్‌ బుధవారం బంజారాహిల్స్‌లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సంజన మాట్లాడుతూ..   నిందితులు తమను బెదిరిస్తున్నారని.. వారికి బెయిల్‌ ఇవ్వొద్దని అభ్యర్థించినట్లు చెప్పారు. రాజస్థానీ సైనిక్‌ క్షత్రియ(మాలి) సంఘ్‌ అధ్యక్షుడు రామ్‌పాల్‌ దేవ్‌డా, ప్రతినిధులు శీతల్‌ దేవ్‌డా, మేఘనాథ్‌, రాహుల్‌, మైనారిటీ కమిషన్‌ పూర్వ సభ్యులు గౌతమ్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని