logo

సఫాయి చుట్టూ సమస్యలు

గ్రేటర్‌లో పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందికి గురవుతున్నారు.  కాలం చెల్లిన ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ యంత్రాలు.. సఫాయన్న కష్టాన్ని హారతి కర్పూరం చేస్తున్నాయి. విధులకు హాజరైనా పనిచేయలేదన్నట్లు

Published : 26 May 2022 02:30 IST

విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందికి గురవుతున్నారు.  కాలం చెల్లిన ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ యంత్రాలు.. సఫాయన్న కష్టాన్ని హారతి కర్పూరం చేస్తున్నాయి. విధులకు హాజరైనా పనిచేయలేదన్నట్లు చూపిస్తున్నాయి.  హాజరు లేకుండా జీతం రాదనే కారణంతో కార్మికులంతా విధుల బహిష్కరణకు దిగారు. ఐదేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు కోసం చేతిలో ఇమిడిపోయే యంత్రాలను సమకూర్చుకుంది. ఒప్పందం ప్రకారం వాటిని ఏడాదికోసారి మార్చేయాలి. బల్దియాలో ఐదేళ్లుగా వాటినే వాడుతున్నారు. గతంలో బయోమెట్రిక్‌ యంత్రాల్లో హాజరు నమోదుకాని కార్మికులకు అధికారులు ఎన్‌ఏ(నాన్‌ అథెంటికేటెడ్‌) విభాగం కింద జీతం చెల్లించేవారు. అలా ఇవ్వొద్దని, రెండు పూటలా బయోమెట్రిక్‌ హాజరు నమోదైన వారికే జీతం ఇవ్వాలని తాజాగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌  నిబంధన పెట్టారు. దాని వల్ల 4వేల మంది కార్మికులకు గత నెల జీతాలు ఆగాయి.  బుధవారం నరగవ్యాప్తంగా గంటపాటు బయోమెట్రిక్‌ యంత్రాలు పని చేయలేదు. బయోమెట్రిక్‌ హాజరు లేకపోతే జీతం ఇవ్వరని గ్రేటర్‌లో విధులు నిర్వర్తించే 18,500 మంది కార్మికులు విధులు బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. వెంటనే ఉపకమిషనర్లు, సహాయ వైద్యాధికారులు రంగంలోకి దిగి, కార్మికులను విధుల్లో పాల్గొనేందుకు ఒప్పించారు. మధ్యాహ్నానికి యంత్రాలు పని చేశాయి. కార్మికుల నుంచి అధికారులు మధ్యాహ్నం హాజరు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని