logo

ప్రజ్ఞారెడ్డికి రక్షణ కల్పించండి

పుల్లారెడ్డి స్వీట్స్‌ యజమాని కుటుంబ వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది. తనపై గృహహింసకు పాల్పడుతున్నారంటూ పుల్లారెడ్డి స్వీట్స్‌ యజమాని రాఘవరెడ్డి కుటుంబంపై ఆయన

Published : 26 May 2022 02:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: పుల్లారెడ్డి స్వీట్స్‌ యజమాని కుటుంబ వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది. తనపై గృహహింసకు పాల్పడుతున్నారంటూ పుల్లారెడ్డి స్వీట్స్‌ యజమాని రాఘవరెడ్డి కుటుంబంపై ఆయన కోడలు ప్రజ్ఞారెడ్డి హైదరాబాద్‌ మొబైల్‌ కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం బాధితురాలికి భద్రత కల్పించాలని పంజాగుట్ట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. తనను హింసిస్తున్నారంటూ ఆమె ఇదివరకే రాఘవరెడ్డి కుటుంబంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత కూడా తనను ఇంటిలోనే నిర్బంధించారంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇంటిలో తనను హింసకు గురి చేస్తున్నారన్న వైనాన్ని తెలిపే ఫొటోలను కూడా ఆమె కోర్టుకు అందజేశారు. దీంతో రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య, కుమారుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని