logo

వివాహ వేడుకలో ముఖ్యమంత్రి

రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు మనవడు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌, డా.శమీత దంపతుల కుమారుడు ఇంద్రనీల్‌ వివాహం డా.కె.శ్రీధర్‌రావు, జయసుధ

Published : 26 May 2022 02:30 IST

కర్మన్‌ఘాట్‌, న్యూస్‌టుడే: రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు మనవడు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌, డా.శమీత దంపతుల కుమారుడు ఇంద్రనీల్‌ వివాహం డా.కె.శ్రీధర్‌రావు, జయసుధ దంపతుల కుమార్తె డా.శంశితతో బుధవారం మన్సూరాబాద్‌లోని కేబీఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో వైభవంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్‌, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు