TS Police: పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు

తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Updated : 12 Oct 2022 11:45 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 17,291 ఉద్యోగాలకు పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్లు జారీ చేయగా.. ఇప్పటి వరకు దాదాపు 13 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

దరఖాస్తు చేయడానికి ఇవాళే చివరి రోజు కావడంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 2 నుంచి చేసుకునే అవకాశం కల్పించిన పోలీస్ నియామక మండలి.. వయోపరిమితిని రెండేళ్లు పెంచింది. దీంతో దరఖాస్తులు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఆగస్టు 7న ఎస్సై పరీక్ష, అదే నెల 21న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని