logo

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణ అనుమతులు రద్దు చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేయించి చర్యలు తీసుకుంటామని తాండూరు ఏడీఏ రుద్రమూర్తి వెల్లడించారు. తాండూరు మండల పరిషత్‌ భవనంలో శనివారం ఎరువులు, విత్తన

Published : 29 May 2022 01:52 IST

మాట్లాడుతున్న ఏడీఏ రుద్రమూర్తి

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణ అనుమతులు రద్దు చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేయించి చర్యలు తీసుకుంటామని తాండూరు ఏడీఏ రుద్రమూర్తి వెల్లడించారు. తాండూరు మండల పరిషత్‌ భవనంలో శనివారం ఎరువులు, విత్తన విక్రయ డీలర్లు, పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాలతో రైతుల పెట్టుబడులు, శ్రమ దండగై నష్టపోవాల్సి వస్తుందన్నారు. గడువు తీరిన విత్తనాలు, విడి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదన్నారు. విక్రయానికి సంబంధించి రైతులకు విధిగా రసీదు అందజేయాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారిణి రజిత, ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, వేణుగోపాల్‌ పాల్గొన్నారు. 

డీలర్లు నిర్ణీత ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలి

పరిగి, న్యూస్‌టుడే: డీలర్లు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను నిర్ణీత ధరలకే విక్రయించాలని అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ డివిజన్‌ సహాయ సంచాలకులు సౌభ్యాగలక్ష్మి, ఎస్సై విఠల్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిషత్తు కార్యాలయంలో డీలర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వానా కాలం సమీపిస్తున్న నేపథ్యంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని డీలర్ల వద్ద విధిగా రసీదు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రభాకర్‌రెడ్డి, పలువురు డీలర్లు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు