logo

శిక్ష పడేలా నేర పరిశోధన సాగాలి

పోలీసు అధికారులు నేర పరిశోధనలో నైపుణ్యం కనబరిచి నిందితులకు న్యాయ స్థానంలో శిక్షలు పడేలా చూడాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. కేసు నమోదు చేసింది మొదలు పక్కాగా ఆధారాలు సేకరించి శిక్షలు పడే శాతాన్ని పెంచాలన్నారు.

Published : 29 May 2022 01:52 IST

దృశ్య, శ్రవణం ద్వారా డీజీపీ నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎస్పీ కోటిరెడ్డి, ఏఎస్పీ రషీద్‌లు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: పోలీసు అధికారులు నేర పరిశోధనలో నైపుణ్యం కనబరిచి నిందితులకు న్యాయ స్థానంలో శిక్షలు పడేలా చూడాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. కేసు నమోదు చేసింది మొదలు పక్కాగా ఆధారాలు సేకరించి శిక్షలు పడే శాతాన్ని పెంచాలన్నారు. శనివారం దృశ్య, శ్రవణ విధానం ద్వారా నిర్వహించిన సమీక్షలో ఎస్పీ కోటిరెడ్డితో ఆయన మాట్లాడారు. శిక్షలు ఖరారైతేనే పోలీసులపై ప్రజలకు నమ్మకం మరింత పెరిగి నేరాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. పోలీస్‌ ఠాణాలకు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డయల్‌ 100కు వెంటనే స్పందించాలని, పోలీస్‌ స్టేషన్ల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని పేర్కొన్నారు. కేసులు నమోదు అనంతరం ఏ స్థాయిలోనూ అపరిష్కృతంగా ఉండకుండా చూసుకోవాలని నకిలీ విత్తనాలతో పాటు మట్కా, గంజాయి, మత్తు పదార్ధాల నిరోధించాలని చెప్పారు. డీజీపీకి జిల్లా పరిస్థితులను, కేసుల వివరాలను ఎస్పీ తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌ పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని