పోలీసుల బుట్టలో మోసగాడు

ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఉంచిన విలువైన కెమెరాలను తప్పుడు ఐడీలతో అద్దెకు తీసుకుని విక్రయించిస్తున్న సైబర్‌ నేరగాడిని తుకారాంగేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు సైతం ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇవ్వగా అది చూసి బేరమాడేందుకు వచ్చి

Updated : 29 May 2022 05:05 IST

తప్పుడు ఐడీలతో కెమెరాలు అద్దెకు తీసుకుని విక్రయం

కెమెరాలను చూపిస్తున్న డీసీపీ చందనదీప్తి

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఉంచిన విలువైన కెమెరాలను తప్పుడు ఐడీలతో అద్దెకు తీసుకుని విక్రయించిస్తున్న సైబర్‌ నేరగాడిని తుకారాంగేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు సైతం ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇవ్వగా అది చూసి బేరమాడేందుకు వచ్చి నిందితుడు దొరికిపోయాడు. నిందితుడి వద్ద నుంచి రూ.5.5లక్షల విలువైన 10కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్‌ డీసీపీ చందనదీప్తి శనివారం ఏసీపీ సుధీర్‌, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ అంబటి అంజనేయులుతో కలిసి వివరాలు వెల్లడించారు. వనపర్తి పట్టణం న్యూటౌన్‌ కాలనీకి చెందిన గంగిడి కిరణ్‌కుమార్‌ యాదవ్‌(27) సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.   ఓఎల్‌ఎక్స్‌లో అద్దెకు, విక్రయించించేందుకు ఉంచిన వాళ్లను గుర్తించి  తప్పుడు గుర్తింపు, ఆధార్‌కార్డులు చూపించి రోజుకు రూ.వెయ్యి చొప్పున అద్దె చెల్లిస్తానంటూ నమ్మకం కుదిరేందుకు కొంత డబ్బును అడ్వాన్స్‌గా చెల్లిస్తాడు. ఆ కెమెరాలను విక్రయిస్తూ జల్సాగా గడుపుతున్నాడు. ఈనెల 6న తుకారాంగేట్‌లో ఉండే విద్యార్థి సాత్విక్‌ ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు కెమెరా ఉంచగా కిరణ్‌కుమార్‌ అద్దెకిస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని నమ్మించాడు. రెండు రోజుల అద్దె ఇచ్చి కెమెరా తీసుకుని వెళ్లాడు. తరువాత నిందితుడి ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడంతో తుకారంగేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని