logo

నరకం ఇక్కడ.. ట్రాఫిక్‌ సిబ్బంది ఎక్కడ?

నాంపల్లి-అఫ్జల్‌గంజ్‌ సర్కిల్‌, ఎంజీబీఎస్‌, మదీనా పరిసరాలు నిత్యం రద్దీగా ఉంటాయి. పూర్తిస్థాయిలో ట్రాఫిక్‌ పోలీసులున్నా క్రమబద్ధీకరణ కష్టతరంగా ఉంటుంది. శనివారం మధ్యాహ్న భోజన సమయంలో ఇద్దరే ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారు.  

Published : 29 May 2022 02:26 IST

నాంపల్లి-అఫ్జల్‌గంజ్‌ సర్కిల్‌, ఎంజీబీఎస్‌, మదీనా పరిసరాలు నిత్యం రద్దీగా ఉంటాయి. పూర్తిస్థాయిలో ట్రాఫిక్‌ పోలీసులున్నా క్రమబద్ధీకరణ కష్టతరంగా ఉంటుంది. శనివారం మధ్యాహ్న భోజన సమయంలో ఇద్దరే ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారు.  వారు నియంత్రించలేకపోవడంతో వాహనదారులు కట్టుతప్పారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది. రెండు గంటలపాటు నడిరోడ్డుపై నరకం కన్పించింది. కొందరు భోజనాలు బస్సుల్లోనే చేశారు. మరికొందరు బస్సులు దిగి నడిచి వెళ్లిపోయారు. 

చార్మినార్‌-అఫ్జల్‌గంజ్‌, ఉస్మాన్‌గంజ్‌-సీబీఎస్‌-అఫ్జల్‌గంజ్‌ మార్గాల్లో కదల్లేని స్థితిలో వాహనాలు

ఉస్మాన్‌గంజ్‌ రోడ్డులో నిలిచిపోయిన ట్రాఫిక్‌

బస్సులోనే మధ్యాహ్న భోజనం చేస్తున్న డ్రైవర్‌, కండక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని