logo

Murder: కడపలో దారుణహత్య.. యువకుడి శరీరంపై 20 కత్తిపోట్లు!

కడప రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తోటి స్నేహితులే కత్తులతో పొడిచి చంపేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడపలోని..

Updated : 25 May 2022 16:23 IST

కడప (క్రైమ్‌): కడప రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తోటి స్నేహితులే కత్తులతో పొడిచి చంపేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడపలోని ఖలీల్‌ నగర్‌కు చెందిన ఇమ్రాన్‌ బాషా(23) అదే ప్రాంతానికి చెందిన షేక్‌ హర్షిత్‌, షేక్‌ మాలిక్‌ స్నేహితులు. ఇటీవల ఇమ్రాన్‌ బాషా తన ఇద్దరు స్నేహితుల వద్ద అప్పుడప్పుడు బెదిరించి కొంత డబ్బు తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం వారిద్దరినీ మరోసారి డబ్బు అడిగాడు. వారు నిరాకరించడంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో షేక్‌ హర్షిత్‌, షేక్‌ మాలిక్‌ వారి వద్ద ఉన్న కత్తులు తీసుకొని ఇమ్రాన్‌ బాషాపై దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని