logo

Nalgonda: జిల్లాలో కలెక్టర్ల బృందం పర్యటన

తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఏడుగురు అసిస్టెంట్ కలెక్టర్స్ ఎన్.ఉమా హారతి, ఆజ్మేరా సంకేత్ కుమార్, గరిమా నరుల, అభిజ్ఞాన్ మాలవీయ, అజయ్ యాదవ్, మృణాల్ శ్రేష్ట, ఐ.ఇ.ఎస్.ఎస్.డి.మనోజ్ (ఎఏఎస్‌-2023 బ్యాచ్) తెలంగాణ దర్శనిలో భాగంగా మంగళవారం జిల్లాలోని భువనగిరి కోటను సందర్శించి విశేషాలను తెలుసుకున్నారు.

Published : 18 Jun 2024 16:13 IST

భువనగిరి: తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఏడుగురు అసిస్టెంట్ కలెక్టర్స్ ఎన్.ఉమా హారతి, ఆజ్మేరా సంకేత్ కుమార్, గరిమా నరుల, అభిజ్ఞాన్ మాలవీయ, అజయ్ యాదవ్, మృణాల్ శ్రేష్ట, ఐ.ఇ.ఎస్.ఎస్.డి.మనోజ్ (ఎఏఎస్‌-2023 బ్యాచ్) తెలంగాణ దర్శనిలో భాగంగా మంగళవారం జిల్లాలోని భువనగిరి కోటను సందర్శించి విశేషాలను తెలుసుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ్మస్వామి వారిని దర్శించుకున్నారు. తదుపరి కొలనుపాకలోని జైన దేవాలయం, సోమేశ్వరాలయం సందర్శించారు. వారి వెంట స్టేట్ నోడల్ అధికారి పెద్దబోయిన శ్రీనివాస్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి జి.సురేష్, ఆలేరు తహసీల్దారు శ్రీనివాస్, టూరిజం డిపార్టుమెంటు గైడ్ వినోద్ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని