logo

Politics: అర్బన్ పాఠశాల తరలింపుపై ఎమ్మెల్యే స్పందించాలి

భువనగిరి పట్టణంలోని అర్బన్ పాఠశాలను తరలించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా భువనగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

Updated : 14 Jun 2024 16:53 IST

భువనగిరి: భువనగిరి పట్టణంలోని అర్బన్ పాఠశాలను తరలించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా భువనగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం తీసుకోవడానికి ఎవ్వరూ లేకపోవడంతో గోడకు వినతిపత్రం అతికించారు.భువనగిరి పట్టణ భాజపా అధ్యక్షుడు రత్నపురం బలరామ్  మాట్లాడుతూ.. స్థానిక అర్బన్‌లో ఉన్నటువంటి స్కూల్‌ను వేరే ప్రాంతానికి తరలించడం సబబు కాదన్నారు. ఎమ్మెల్యే  వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టణం కపిల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోగా స్పందించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు బూరుగు మణికంఠ, మంగు నరసింహారావు, బట్టు క్రాంతి, కొలిచెలిమి మల్లికార్జున్, నాగు నరేష్, రత్నపురం శ్రీశైలం, కుమ్మరి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని