logo

Nalgonda: త్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ధర్నా

ప్రాంతీయ రింగు రోడ్డు(ట్రిపుల్ ఆర్) నిర్మాణానికి చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు రెవెన్యూ గ్రామ పరిధిలో భూమిని కోల్పోతున్న రైతులు స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట శుక్రావారం ధర్నా నిర్వహించారు.

Updated : 14 Jun 2024 16:24 IST

చౌటుప్పల్: ప్రాంతీయ రింగు రోడ్డు(ట్రిపుల్ ఆర్) నిర్మాణానికి చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు రెవెన్యూ గ్రామ పరిధిలో భూమిని కోల్పోతున్న రైతులు స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట శుక్రావారం ధర్నా నిర్వహించారు. భూ నిర్వాసితులతో ఆర్డిఓ శేఖర్ రెడ్డి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ కార్యక్రమం చేపట్టారు. తాము కోల్పోతున్న భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని ఇవ్వాలని లేనట్టయితే ప్రస్తుత మార్కెట్ ధర చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు