logo

ఉద్యోగ సంఘం నేత జన్మదిన వేడుకలు

జిల్లా ఉద్యోగ వికాస ఛైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆర్డీవో  కార్యాలయంలో నిర్వహించారు.

Updated : 15 Jun 2024 14:59 IST

భువనగిరి: జిల్లా ఉద్యోగ వికాస ఛైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆర్డీవో  కార్యాలయంలో నిర్వహించారు. ఉద్యోగ సంఘ నాయకులు ఆర్డీవో అమరేందర్ సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో అమరేందర్ ఉపేందర్‌రెడ్డిని శాలువాతో సత్కరించారు. విధులు సక్రమంగా నిర్వహించే వారికి ఎక్కడైనా గుర్తింపు ఉంటుందని ఆర్డీవో అన్నారు. కార్యాలయ పరిపాలన అధికారిగా ఉద్యోగ సంఘ నాయకునిగా ప్రజలకు, ఉద్యోగులకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు ఖదీర్, సంజీవరెడ్డి, రామారావు, శ్రీకాంత్, సజ్జాద్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని