logo

Nalgonda: మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేయాలి

మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే అధికారులకు సూచించారు.

Updated : 21 Jun 2024 19:55 IST

భువనగిరి: మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో సెర్ప్, స్త్రీనిధి సిబ్బందికి మహిళా శక్తి కార్యక్రమం అమలుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలను ఆర్థికంగా కోటీశ్వరులను చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా నెరవేర్చాలని సూచించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారాలను ప్రోత్సహించి సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడం మహిళా శక్తి పథకం ప్రధాన ఉద్దేశాలని అన్నారు.  
కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.ఎ.కృష్ణన్,  మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, అడిషనల్ డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డీపీఎంలు, ఏపీఎంలు, సెర్ప్, స్త్రీనిధి సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని