logo

MLA: మినీ ట్యాంక్‌బండ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

భువనగిరి చెరువుపై మినీ ట్యాంక్‌బండ్ పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.

Updated : 14 Jun 2024 16:53 IST

భువనగిరి: భువనగిరి చెరువుపై మినీ ట్యాంక్‌బండ్ పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల ప్రగతిని ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల ప్రగతిపై సమీక్షించారు. వీలైనంత త్వరలో పనులన్నీ పూర్తి చేయాలని సందర్శకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ ప్రమోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని