logo

Nalgonda: మురుగు కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే

వర్షాకాలంలో చౌటుప్పల్ చెరువు నుంచి విడుదలయ్యే వరద నీటితో పట్టణంలో ముంపు సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Updated : 14 Jun 2024 16:22 IST

చౌటుప్పల్: వర్షాకాలంలో చౌటుప్పల్ చెరువు నుంచి విడుదలయ్యే వరద నీటితో పట్టణంలో ముంపు సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ పట్టణంలో ఆయన టీయూఎఫ్ ఐడీసీ నిధులతో నిర్మిస్తున్న రోడ్డులో పెద్ద చెరువును మురుగు కాలువలను శుక్రవారం పరిశీలించారు. మురుగునీరు సాఫీగా ప్రవహించేందుకు చర్యలు తీసుకోవాలని అసంపూర్తి డ్రైనేజీ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పురపాలిక ఛైర్మన్‌ వెన్ రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, పుర కమిషనర్ వెంకటేశ్వర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని