logo

Bhongir: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం: ఎంపీ

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Updated : 14 Jun 2024 16:54 IST

భువనగిరి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎంపీ తెలిపారు. ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడి బాటలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని