logo

నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది.

Updated : 20 May 2024 07:47 IST

తీన్మార్‌ మల్లన్న , గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి , ఏనుగుల రాకేశ్‌రెడ్డి

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్‌-తీన్మార్‌ మల్లన్న, భాజపా-గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, భారాస-ఏనుగుల రాకేశ్‌రెడ్డిలు గతంలో భారతీయ జనతా పార్టీలో పని చేసిన వారే. జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన తీన్మార్‌ మల్లన్న 2015లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్సీ బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు, 2021 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2021లోనే భాజపాలో తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి 2023లో కాంగ్రెస్‌ గూటికి చేరారు. భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆ పార్టీలో అనేక పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ.. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి 2013లో భాజపాలో చేరి బీజీవైఎంలో పదవులు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, భద్రాద్రి జిల్లా ఇన్‌ఛార్జిగా పని చేశారు. ఈ సంవత్సరం భారాసలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని