logo

నేలకేసి కొట్టి చిన్నారి దారుణ హత్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ చిన్నారిని హత్య చేసిన ఘటన చివ్వెంల మండలంలోని అయిలాపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 13 Jun 2024 06:20 IST

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని ఘాతుకం

మృతి చెందిన చిన్నారి మహన్వి

చివ్వెంల, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ చిన్నారిని హత్య చేసిన ఘటన చివ్వెంల మండలంలోని అయిలాపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజమాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం సాటాపూర్‌ గ్రామానికి చెందిన మోత్క విజయ-సాయిల్‌ కుమార్తె రమ్య అలియాస్‌ నవ్యశ్రీకి అదే మండలం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌కు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల అరుణ్య, 22 నెలల మహన్వి కుమార్తెలున్నారు. ఏడు నెలల కిందట నవ్యశ్రీ తన అత్తగారి గ్రామానికి చెందిన బొల్లెంక అరవిందరెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె భర్తను వదిలి చిన్నారి మహన్వి, అతనితో చివ్వెంల మండలంలోని అయిలాపురానికి వచ్చి నివాసం ఉంటోంది. కాలక్రమేణా తన వివాహేతర సంబంధానికి మహన్వి అడ్డువస్తోందని అరవిందరెడ్డి భావించారు. ఈ నెల 11న ఆయన ఆ చిన్నారిని నేలకు కొట్టి గాయపరిచి హతమార్చాడు. ఈ మేరకు మృతురాలు మహన్వి మేనత్త కటికల గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్సై బి.వెంకట్రెడ్డి తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని