logo

వృద్ధురాలిపై లైంగిక దాడి

వృద్ధురాలిపై బంధువు అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం నల్గొండ జిల్లా చందంపేటలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 13 Jun 2024 06:23 IST

పోలీసుల అదుపులో నిందితుడు

చందంపేట, న్యూస్‌టుడే: వృద్ధురాలిపై బంధువు అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం నల్గొండ జిల్లా చందంపేటలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు (80) ఓ పట్టణంలో నివాసం ఉంటున్న తన పెద్ద కుమార్తె వద్ద ఉంటోంది. కుమారుడు జీవనోపాధి కోసం తన కుటుంబ సభ్యులతో వలసబాట పట్టాడు. ఇటీవల ఆసరా పింఛన్‌ కోసం స్వగ్రామానికి వచ్చి ఇంట్లో ఉంది. ఆమెకు వరుసకు అల్లుడైన ఓ వ్యక్తి (50) మద్యం మత్తులో మంగళవారం ఉదయం వృద్ధురాలికి మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె స్పృహ కోల్పోయినప్పటికీ చిత్రహింసలకు గురిచేయడంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి వరకు ఆమె బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉంది. చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని