logo

బంగారం వ్యాపారి వద్ద నగదు పట్టివేత

మిర్యాలగూడకు చెందిన ఓ బంగారం వ్యాపారి గురువారం పలక్‌నుమా రైలులో రూ.1.28 కోట్ల వరకు నగదు తీసుకుని హైదరాబాద్‌కు వెళ్తుండగా రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు.

Published : 14 Jun 2024 02:01 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: మిర్యాలగూడకు చెందిన ఓ బంగారం వ్యాపారి గురువారం పలక్‌నుమా రైలులో రూ.1.28 కోట్ల వరకు నగదు తీసుకుని హైదరాబాద్‌కు వెళ్తుండగా రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో నల్గొండలో రెండు బ్యాగుల్లో తనిఖీలు చేసిన నగదును రాత్రి 9 గంటల ప్రాంతంలో లెక్కించి ట్రెజరీలో జమ చేసినట్లు ఆర్‌పీఎఫ్‌ సీఐ సురేందర్‌గౌడ్‌ తెలిపారు. పట్టుబడిన నగదు ఎంత మొత్తం ఉంటుందనేది పోలీసులు రాత్రి వరకు గోప్యంగా ఉంచారు. మిర్యాలగూడకు చెందిన కొంత మంది బంగారం వ్యాపారులు కలిసి నిత్యం పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లి హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో బంగారం కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలా నగదు చెల్లించి కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వానికి వ్యాట్‌ చెల్లించకుండా తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు