logo

మోత్కూరు ఎఫ్‌ఎస్‌సీఎస్‌ హస్తగతం

మోత్కూరు రైతుసేవా సహకార సంఘం(ఎఫ్‌ఎస్‌సీఎస్‌) ఛైర్మన్‌ పదవి కాంగ్రెస్‌ ఖాతాలో పడింది.

Published : 14 Jun 2024 02:03 IST

 

మోత్కూరు, న్యూస్‌టుడే: మోత్కూరు రైతుసేవా సహకార సంఘం(ఎఫ్‌ఎస్‌సీఎస్‌) ఛైర్మన్‌ పదవి కాంగ్రెస్‌ ఖాతాలో పడింది. గత ఛైర్మన్‌ కంచర్ల అశోక్‌రెడ్డిపై(భారాస)పై వైస్‌ ఛైర్మన్‌ పేలపూడి వెంకటేశ్వర్లుతో కలిసి తొమ్మిది మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టగా.. నెగ్గింది. గురువారం సంఘ కార్యాలయంలో సమావేశంలో పేలపూడి వెంకటేశ్వర్లును సూతన ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సహకార అధికారి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మొత్తం 13 మంది డైరెక్టర్లుండగా తొమ్మిది మంది హాజరయ్యారు. వెంకటేశ్వర్లును డైరెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీనర్సింహారెడ్డి ప్రతిపాదించగా, మరో డైరెక్టర్‌ తాళ్లపల్లి స్వామి బలపర్చినట్లు పేర్కొన్నారు. వైస్‌ఛైర్మన్‌ ఎన్నికను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు ఛైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో నూతనంగా ఛైర్మన్‌గా ఎన్నికైన పేలపూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సంఘాన్ని రైతులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. డైరెక్టర్లు ఆకుల వెంకటేశ్వర్లు, సుజాత, పద్మ, చంద్రశేఖర్, లక్ష్మణ్, ముత్తయ్య, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ కంచర్ల యాదగిరిరెడ్డి, నాయకులు రామచంద్రుగౌడ్, బాలరాజుగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, నాగార్జున్‌రెడ్డి, అవిలిమల్లు, సురేష్‌. అంజయ్య, సత్యనారాయణచౌదరి, మధు, ఆయాజ్, కె.వెంకన్న, పాండు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు