logo

పంట చేనుల్లో పెట్రోలియం పైపులైన్‌

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్‌ వరకు (కేహెచ్‌పీఎల్‌) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నిర్మిస్తున్న పెట్రోలియం పైపులైన్‌ నిర్మాణ పనులు మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి.

Updated : 14 Jun 2024 05:47 IST

ముమ్మరంగా సాగుతున్న నిర్మాణ పనులు

కనగల్, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్‌ వరకు (కేహెచ్‌పీఎల్‌) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నిర్మిస్తున్న పెట్రోలియం పైపులైన్‌ నిర్మాణ పనులు మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం 451 కి.మీ దూరం పైపులైన్‌ ఏర్పాటు చేయడానికి రూ.1,926 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. తెలంగాణలో రూ.864 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే సమగ్ర సర్వే పూర్తి చేసి రైతులకు నోటీసులు జారీ చేసి పనులు ప్రారంభించారు. భూమి కోల్పోతున్న రైతులకు పరిహారం అందజేశారు. కోదండపూరం, అనంతారం, జి.చెన్నారం. మంచినీళ్లబావి, తోరగల్‌ తదితర ప్రాంతాల్లో పనులు సాగుతున్నాయి. 

నిర్మాణం ఇలా..

పైపులైన్‌ కోసం 16 మీటర్ల వెడల్పు భూమి స్వాధీనం చేసుకుంటున్నారు. అందులో రెండు మీటర్ల వెడల్పు ఆరు అడుగుల లోతు తవ్వుతారు. పైపులైన్‌కు ఒకవైపున మూడు మీటర్లు, మరో వైపు 11 మీటర్ల మేరకు ఖాళీ స్థలం ఉంచుతారు. లైన్‌కోసం తవ్విన మట్టిని ఒకవైపు పోసి, సామగ్రిని మరో వైపు నుంచి తీసుకెళ్తారు. 16 అంగుళాల పైపు వేసి తిరిగి ఆ మట్టిని పూడ్చి వేస్తారు. 


పనులు పూర్తయ్యాక పంటల సాగు

నులు పూర్తయిన తర్వాత రైతులు ఎప్పటిలా పంటలు సాగు చేసుకోవచ్చు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు తప్ప వేర్లు బాగా లోపలికి వెళ్లి పైపును డ్యామేజీ చేసే మామిడి, యూకాలిప్టస్‌ లాంటి మొక్కలు సాగు చేసే అవకాశం లేదు. భూమి విలువలో పది శాతంతో పాటు సాగు పనులు జరుగుతుంటే ఆ సీజన్‌ పంటకు కూడా పరిహారం అందించనున్నారు. ప్రతి పది, పదిహేన్‌ కిలో మీటర్ల దూరంలో చెకింగ్‌ పాయింట్‌తో పాటు సెన్సారులు ఏర్పాటు చేయనున్నారు. ఒక వైపు పెట్రోలియం పైపులైన్‌ మరోవైపు రైల్వే మార్గానికి సర్వే జరుగుతుండటంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఎక్కువగా నిమ్మ తోటలు కోల్పోతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు