logo

‘వెల’విల

జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారుతున్నాయి.

Updated : 17 Jun 2024 06:06 IST

ఆకాశన్నంటుతున్న కూరగాయల ధరలు

సూర్యాపేట మార్కెట్‌లో కూరగాయల వ్యాపారులు 

భానుపురి, కుడుకుడరోడ్డు(సూర్యాపేట) న్యూస్‌టుడే: జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారుతున్నాయి. మార్కెట్‌కు రూ.500 తీసుకొని వెళ్తే మూడు రోజులకు సరిపడా కూరగాయలు కూడా వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. పంటల సాగు తగ్గటం.. ఎండల ప్రభావంతో డిమాండ్‌ ఏర్పడి వెలలు పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ పరిస్థితి..

  • జిల్లాలోని సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో కూరగాయల మార్కెట్లున్నాయి. హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్లలో లేవు. ఇక్కడికి వ్యాపారులు వచ్చి వారసంతలో విక్రయాలు చేపడుతుంటారు. సూర్యాపేట మార్కెట్‌లో నిత్యం కూరగాయల క్రయవ్రికయాలు సాగుతుంటాయి. ఈ మార్కెట్‌కు గతంలో స్థానికంగా సాగైన పంటలను రైతులు తీసుకొచ్చేవారు. వేసవిలో ఎండల ప్రభావం కారణంగా సాగు చేపట్టలేదు.. చేసినా ఎండిపోయాయి. దీంతో కొరత ఏర్పడి ధరలు మండిపోతున్నాయి. సూర్యాపేట మార్కెట్‌కు హైదరాబాద్, ఆంధ్రా ప్రాంతాలను నుంచి దిగుమతి అవుతున్నాయి. రవాణా ఖర్చులు, పంట కొరత కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
  • కోదాడ మార్కెట్‌కు ఖమ్మం, విజయవాడ, కర్నూలు ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా పంటలు పండకపోవడంతో వ్యాపారులు ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. దీంతో కూరగాయల సాగు తక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయి. హుజూర్‌నగర్, నేరేడుచర్లలోని వ్యాపారులు కూడా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

రోజుకు 2-3 టన్నుల దిగుమతి

సూర్యాపేట, కోదాడ మార్కెట్లకు ఇతర ప్రాంతాల నుంచి రోజుకు 2-3 టన్నుల కూరగాయలను వ్యాపారులు దిగుమతి చేస్తుంటారు. సీజన్‌లో ఒక్కోరోజు 4 టన్నుల కూడా చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు. వాటిని స్థానిక మార్కెట్‌లోనే కాకుండా జిల్లాలోని గ్రామాలు, ఇతర ప్రాంతాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కొరత ఉన్నందున రెండు టన్నులే దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని