logo

కవులు, కళాకారులకు నిలయం మోత్కూరు

కవులు, కళాకారులు, గాయకులు, ఉద్యమకారులకు నిలయం మోత్కూరు అని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు.

Published : 18 Jun 2024 04:39 IST

నందిని సిధారెడ్డి

మోత్కూరు, న్యూస్‌టుడే: కవులు, కళాకారులు, గాయకులు, ఉద్యమకారులకు నిలయం మోత్కూరు అని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైజే ఫంక్షన్‌హాల్‌లో మోత్కూరు సామాజిక సేవాసంస్థ పూర్వ ప్రధాన కార్యదర్శి, కవయిత్రి మర్రి జయశ్రీ రచించిన ‘మమతల పందిరి’ ఆవిష్కరణ, అంకితోత్సవాన్ని ప్రజాభారతి అధ్యక్షుడు దేవినేని అరవిందరాయుడు అధ్యక్షతన నిర్వహించారు. సిధారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి ఉద్వేగ నిలయం మోత్కూరు అని కొనియాడారు. ప్రముఖ సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. నాటి సాయుధ పోరాటం నుంచి నేటి మలిదశ ఉద్యమం వరకు అనేక ఉద్యమాల్లో మోత్కూరు ముందు నిలిచిందన్నారు. ‘మమతల పందిరి’ ఆవిష్కరించి కవయిత్రి జయశ్రీ తల్లి మరియమ్మకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా పోచం సుజాత రచించిన సుజాత కుసుమాలను కూడా ఆవిష్కరించారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పోరెడ్డి రంగయ్య, ప్రధాన కార్యదర్శి బండారు జయశ్రీ, హైదరాబాద్‌ డిప్యూటీ కలెక్టర్‌ దామల్ల రాంప్రసాద్, కులీకతుబ్షా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మీసాల సైదులు, ప్రముఖ చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్, అమ్మయాది ఫౌండేషన్‌ అధ్యక్షుడు పెండెం సత్యనారాయణ, విశ్రాంత ఉద్యోగుల సంఘం స్థానిక పూర్వ అధ్యక్షుడు మర్రి ఆనందం, కేరళ నాభి అకాడమీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గోలి రామకృష్ణ, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ బండ్ల రవికుమార్, డిప్యూటీ తహసీల్దారు మేక శివకుమార్, ఓయూ జేఏసీ నాయకుడు మర్రి అనిల్‌కుమార్, ప్రజాభారతి కార్యదర్శి వెంకన్న, కోశాధికారి జి.వెంకటేశ్వర్లు, పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు కె.మహేందర్, టి.మనోహరాచారి, బి.హనుమంతు, ఎం.సోమయ్య, చంద్రశేఖర్, రాజు, మనోహర్, ఈ.రాంప్రసాద్, కవయిత్రులు విజయలక్ష్మీ, అరుణ, సుజాత, పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని