logo

సూర్యాపేట ఎస్పీ బదిలీ

సూర్యాపేట నూతన ఎస్పీగా 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సన్‌ప్రీత్‌ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 18 Jun 2024 04:43 IST

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేట నూతన ఎస్పీగా 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సన్‌ప్రీత్‌ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల ఎస్పీగా విధులు నిర్వహిస్తూ ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్పీగా పనిచేసిన రాహుల్‌ హెగ్డేను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా బదిలీ చేశారు. 2023 అక్టోబరు 13న అప్పటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాహుల్‌ హెగ్డే సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విషయం విధితమే. అప్పటి వరకు ఇక్కడ పనిచేసిన రాంజేంద్రప్రసాద్‌ ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఆయనపై ఎన్నికల కమిషన్‌ బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌ హెగ్డే ఎనిమిది నెలల పాటు విజయవంతంగా విధులు నిర్వహించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అసెంబ్లీ, లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను పూర్తి చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని