logo

ఎస్పీగా శరత్‌చంద్ర పవార్‌

రాష్ట్ర యాంటి నార్కోటిక్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా పని చేస్తున్న శరత్‌ చంద్ర పవార్‌ నల్గొండ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం సోమవారం కేటాయించింది.

Published : 18 Jun 2024 04:52 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్ర యాంటి నార్కోటిక్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా పని చేస్తున్న శరత్‌ చంద్ర పవార్‌ నల్గొండ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం సోమవారం కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన శరత్‌ చంద్ర పవార్‌ ముంబాయి ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మూడు సార్లు ఐపీఎస్‌ పరీక్షలు రాసి 2016 ఐపీఎస్‌ బ్యాచ్‌లో ఎంపికయ్యారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మొదటి సారి ఏఎస్పీగా పనిచేశారు. ఆ తరువాత రామగుండం, ఏటూరు నాగారంతో పాటు మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీగా, హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఎస్పీగా బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లా ఎస్పీగా ఇప్పటి వరకు పనిచేసిన చందనా దీప్తికి సికింద్రాబాద్‌ రైల్వే సూపరింటెండెంట్‌గా స్థానచలనం జరిగింది. ఈ ఏడాది జనవరి ఒకటిన బాధ్యతలు తీసుకున్న ఆమె లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని