logo

ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేయాలి: జూలకంటి

కేంద్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను పక్కాగా అమలు చేయాలని మాజీ శాసనసభ సభ్యుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటిరంగారెడ్డి అన్నారు.

Published : 18 Jun 2024 04:55 IST

పెన్‌పహాడ్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను పక్కాగా అమలు చేయాలని మాజీ శాసనసభ సభ్యుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటిరంగారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సత్యా గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో గతంలో అనుసరించిన విధానాలు కాకుండా దేశాభివృద్ధి కోసం ప్రజల ఎజెండాగా పనిచేయాలని కోరారు. పెన్‌పహాడ్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 21 వరకు జరగనున్న జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్రం విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విడతల వారీగా కాకుండా ఏకకాలంలో చేయాలన్నారు. సాగు సీజన్‌లో రైతులకు ఉపయోగపడేందుకు రైతు భరోసా వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, ఎం.రాంబాబు, ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, రణపంగ కృష్ణ, కోటగోపి, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, మడ్డి అంజిబాబు, నెమ్మాది అడివయ్య, గుంజ వెంకటేశ్వర్లు, గోపిరెడ్డి, పీˆరయ్య, రమేశ్, కిరణ్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని