logo

రూ. 90 కోట్లతో నీలగిరి వేదిక

నల్గొండలో నిర్మించతలపెట్టిన కళాభారతి నిర్మాణ ఆకృతితోపాటు పేరు కూడా నీలగిరి వేదికగా మారింది. నల్గొండ నడిబొడ్డున రోడ్ల భవనాలశాఖ, నీటిపారుదలశాఖ కార్యాలయాల స్థలంలో గత భారాస ప్రభుత్వం కళాభారతి నిర్మించాలని నిర్ణయించింది.

Updated : 18 Jun 2024 05:45 IST

2వేల మంది కూర్చునేలా నిర్మాణం 

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: నల్గొండలో నిర్మించతలపెట్టిన కళాభారతి నిర్మాణ ఆకృతితోపాటు పేరు కూడా నీలగిరి వేదికగా మారింది. నల్గొండ నడిబొడ్డున రోడ్ల భవనాలశాఖ, నీటిపారుదలశాఖ కార్యాలయాల స్థలంలో గత భారాస ప్రభుత్వం కళాభారతి నిర్మించాలని నిర్ణయించింది. శాసనసభ ఎన్నికల ముందు అప్పటి మంత్రి కేటీఆర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ.. ముందడుగు పడలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అదే స్థలంలో నిర్మించనున్న నీలగిరి వేదికకు రూ.90 కోట్లు కేటాయించారు. 2వేల మంది ప్రజలు కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం నిర్మించాలని నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టారు 

సరికొత్త ఆకృతిలో నమూనా..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచనల మేరకు నీలగిరి వేదిక నిర్మాణ ఆకృతులను ప్రభుత్వం పైనల్‌ చేసింది. శనివారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ రమేష్‌గౌడ్‌ నమూన ఆకృతులను పరిశీలించారు. నూతన ఆకృతులతో నిర్మితమవుతున్న ఆడిటోరియంలో వాహనాలకు పార్కింగ్‌ ఇబ్బందులు లేకుండా సెల్లార్‌ నిర్మించనున్నారు. ప్రజలు సేదతీరేందుకు వెనుక భాగంలో పచ్చని తీవాచీ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఆడిటోరియం నిర్మాణ స్థలం దిగువ భాగంలో భవిష్యత్తులో భారీ షాపింగ్‌మాల్‌ నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని