logo

ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు: డీఎస్పీ

గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను సూర్యాపేటలో గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ జి.రవి తెలిపారు. నిందితుల నుంచి ఎనిమిది కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

Published : 21 Jun 2024 06:01 IST

సూర్యాపేటలో గంజాయి నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రవి, చిత్రంలో సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్, తదితరులు 

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను సూర్యాపేటలో గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ జి.రవి తెలిపారు. నిందితుల నుంచి ఎనిమిది కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పట్టణ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ తెలిపిన నిందితుల వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణానికి చెందిన కొడిదల పవన్‌కుమార్‌ అలియాస్‌ పవన్, మన్నె రాహుల్‌ అలియాస్‌ సన్నితోపాటు మరో మైనర్‌ బాలుడు ఖమ్మం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఖమ్మం రోడ్డులోని అమ్మ గార్డెన్‌ వద్ద పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకొని బ్యాగును పరిశీలించగా అందులో ఎనిమిది కిలోల గంజాయి దొరికిందని డీఎస్పీ తెలిపారు. నిందితుల్లో పవన్‌కుమార్, మైనర్‌ బాలుడు రెండు రోజుల క్రితం ఖమ్మం నుంచి రైలులో అరకు వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేసుకొని తిరిగి ఖమ్మం వచ్చారు. ద్విచక్ర వాహనంపై వెళ్లిన రాహుల్‌ వీరిద్దరినీ తీసుకొని తిరిగి సూర్యాపేటకు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. 

గంజాయిని ఎక్కువ డబ్బుకు విక్రయించాలన్న ఉద్దేశంతో రవాణా చేస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్, ఎస్సైలు మహేంద్రనాథ్, బి.కుశలవ, క్రైమ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ కృష్ణ, కరుణాకర్, సైదులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని