logo

గ్రామస్థాయిలో తెదేపాను బలోపేతం చేయాలి

తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి రాష్ట్రంలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు అన్నారు.

Published : 21 Jun 2024 06:10 IST

బక్కని నర్సింహులు

అల్లాపురంలో తెదేపా జెండాను ఆవిష్కరించి మాట్లాడుతున్న బక్కని నర్సింహులు

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి రాష్ట్రంలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ఊరూరా జెండా పండుగ కార్యక్రమాన్ని ఆయన అల్లాపురంలో ప్రారంభించారు. జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్టీ శ్రేణులు కష్టపడి పని చేస్తే 2029లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని తెలిపారు. అనంతరం పీపల్‌పహాడ్, దేవలమ్మనాగారం, కొయ్యలగూడెం గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడుగు లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కుందారపు కృష్ణమాచారి, వెంకటేశం, పర్వతాలుయాదవ్, రఘుపతి, గోవిందాచారి, వెంకటేశం, జంగయ్య, కోటేశ్వర్, నారాయణపురం మండల అధ్యక్షుడు సుబ్బారావు పాల్గొన్నారు.

అధ్యక్షుల నియామకం.. అల్లాపురం అధ్యక్షుడిగా సింగిరెడ్డి సురేందర్‌రెడ్డి, పీపల్‌పహాడ్‌ అధ్యక్షుడిగా వెంకటేశం, దేవలమ్మనాగారం గౌరవ అధ్యక్షుడిగా మోహన్‌రెడ్డి, అధ్యక్షుడిగా ఉపేంద్రచారి, కొయ్యలగూడెం అధ్యక్షుడిగా కుమార్‌లను నియమించినట్లు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి లక్ష్మయ్య తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని